బీజేపీకే శేరిలింగంపల్లి నియోజకవర్గ టికెట్ 

  • సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం 
  • చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూడలేక అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు వార్తలను ఎవరు నమ్మొద్దని కొండ ఈశ్వర్ రెడ్డి, మాజీ బిక్షపతి యాదవ్ అన్నారు. మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో శేర్లింగంపల్లి నియోజకవర్గ టికెట్టు పొత్తులలో జనసేన పార్టీకి పోతుందంటూ ఫేక్ వార్తలు అందిస్తూ కార్యకర్తలను, నాయకులను అయోమయానికి గురి చేయడం సమంజసం కాదని తీవ్రంగా ఖండించారు.

తప్పకుండా నూటికి నూరు శాతం శేరిలింగంపల్లి నియోజకవర్గ టికెట్టు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారని అధిష్టానంపై పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి గత ఆరు, ఏడు నెలలుగా నిర్విరామంగా పాదయాత్రలు చేస్తూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై ఎనలేని కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ కి ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల శేరిలింగంపల్లి టికెటు లభిస్తుందని, అసెంబ్లీలో అడుగు పెడతారని కార్యకర్తలకు నాయకులకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సేవ చేయాలనే దృక్పథంతో భారతీయ జనతా పార్టీలో చేరానన్నారు. కండువా కప్పుకున్న నాటినుండి ఒక సైనికుడి లాగా పని చేశానని, అధిష్టానం పెద్దల దీవెనలు తమపై ఉన్నాయని, మీరంతా అధైర్య పడకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పనిచేసి భారతీయ జనతా పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా , యువ మోర్చా, ఓ బి సి మోర్చా , ఎస్టీ మోర్చా, వివిధ మోర్చన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here