ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం

  • ముక్తకంఠంతో నినదించిన లక్ష్మీ విహార్ ఫేస్ 1, నానక్ రాంగూడ కాలనీ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేస్ 1, నానక్ రాం గూడ, గోపన్ పల్లి అవంతిక హోమ్స్ కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజయ్ సిటీ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. తామంతా ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటామని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకకవర్గంను అభివృద్ధి చేశామని, ముఖ్య మంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

బ్రహ్మాండంగా ఫ్లై ఓవర్లు , అండర్ బ్రిడ్జిలు, కొత్త రోడ్లు వేశామని, చాలా సంతోషంగా ఉందని , ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు , మంత్రిప్రగడ సత్యనారాయణ, దాసరి గోపి, ప్రసాద్, మల్లేష్, నాగభూషణం కాలనీ వాసులు , కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here