- మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ వర్ధంతి సందర్భంగా సేవ కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: మసీదు బండలో పారిశుధ్య కార్మికులకు ఉచితంగా చీరలు, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు పండ్లు పంపిణి చేసి, విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా భోజనం వడ్డించారు. బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని తండ్రి భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహించారు.

ఈ సందర్బంగా భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ రాజ్ కుమార్ వర్ధంతి సందర్భంగా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టిన ఆర్ కే వై టీం సభ్యులను అభినందిస్తూ రాజ్ కుమార్ యాదవ్ తమ కుటుంబంలో లేని లోటు తీరినదని తెలిపారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మమ్ములను విడిచి మూడేండ్లు గడిచిందని చింతిస్తూ.. తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజ్ కుమార్ యాదవ్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి యాదవ్ అభిమానులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
