- చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వేమన వీకర్ సెక్షన్ కాలనీలో ఇంటికి తిరిగి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు కాలనీవాసులకు సూచించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చెందిందని అన్నారు.
ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ఐటి ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. అంతేకాకుండా పేద ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పేదలకు వృద్ధులకు బిసిలకు దళితులకు ఆర్థికంగా ఎదుగుదల కోసం ఆసరా, పింఛన్లు, బిసి బంధు, దళిత బంధు వంటి పథకాలను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు.