- బిఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన వారికి సాదరంగా ఆహ్వానం
నమస్తే శేరిలింగంపల్లి: క్రమక్రమంగా పెరుగుతున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్నది. పలు పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయా కాలనీల వాసులు అత్యధికంగా చేరుతుండడంతో మరింత పుంజుకుంటున్నది.
ఇందులో భాగంగానే గురువారం రామ్ చందర్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన బండారు శ్రీనివాస్ ముదిరాజ్, మన్నే విజయ్ ముదిరాజ్, రవి గౌడ్, నవీన్, బాలు, అశోక్, హరీష్, మహిపాల్, వంశీ, వరుణ్, సందీప్, శ్రీనివాస్, చరణ్ రెడ్డి, విజయభాస్కర్ తో పాటు మరో 30 మందికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.