నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని అలిండ్, బాపునగర్ మెయిన్ రోడ్డు యందు మంజీరా నీటి పైప్ లైన్ పగిలిపోయిన విషయం తెలిసిందే. ఇలా గత మూడు నెలల నుండి రోడ్డు పై తాగునీరు వృధాగా పోతున్నం దున, జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత HMWSSB అధికారులతో మాట్లాడి పగిలిపోయిన మంజీరా పైప్ లైన్ పనులను ప్రారంభించారు.
ఈ సందర్బంగా కాలనీవాసులు కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, రవీంద్ర రాథోడ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.