సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్దంగా పని చేస్తాం: బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • కొండాపూర్ డివిజన్ , శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ లో కొనసాగిన గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ , శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ లో గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్ర కొనసాగింది. బీజేపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఇంటింటా పర్యటించారు. సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉండి ప్రజలను ,ప్రజల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని, వారి అనునుయుల స్వలాభం , వారి స్వలాభం కోసం అవినీతికి, అక్రమాలకు , భూ కబ్జాలకు , వసూళ్లకు పాల్పపడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలకోసం , ప్రతి కాలనీ , ప్రతి బస్తి , ప్రతి కమ్యూనిటీ , ప్రతి సమస్య ప్రధానమేనని, ప్రణాళిక బద్దంగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి , శ్రీశైలం యాదవ్ , వెంకటేష్ , అనంత రెడ్డి, రంగ స్వామి, ఆంజనేయులు , నీలం కృష్ణ , పద్మ ,పార్వతి, నవీన్ రెడ్డి, అనిల్ , రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, కిరణ్ , గోపాల్, రాజేందర్, రమేష్, మధు యాదవ్, అరుణ్ , నరేష్, మల్లేష్ , మఖన్ సింగ్, రామ్ రెడ్డి, కుమార్ నరసింహ, శ్రీను, రెహ్మతుల్ల, స్థానిక నాయకులు, కాలనీ వాసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here