- ఏ ఎస్ వై ఎఫ్ 10వ వార్షికోత్సవంలో రోహిత్ ముదిరాజ్
నమస్తే శే రిలింగంపల్లి: ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ (ఏ ఎస్ వై ఎఫ్) వార్షికోత్సవ సంబురాలు వేడుకగా నిర్వహించారు.
స్వర్గీయ శ్యామ్ (ఏ ఎస్ వై ఎఫ్ చైర్మన్) స్పూర్తితో నిరుపేదలకు సేవలు అందిస్తూ.. పది సంవత్సరాలు పూర్తి చేసుకొ ని 11వ సంవత్సరంలోకి అడిగిడింది. 10 వేలకు పైగా నిరుపేదలకు సేవ చేసాము అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆ సంస్త ఫౌండర్ రోహిత్ ముదిరాజ్ అన్నారు. ఇన్నేళ్లుగా సేవలు అందిస్తూ వస్తున్న తన బృందానికి, మద్దతిదారులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాను ముదీరాజ్, రాజేష్, నాయుడు, సంతు, రాకేష్, చందు, కలీం, మహేందర్ పాల్గొన్నారు.