- ప్రియురాలు, ఆమె తల్లిపై కత్తితో దాడి..
- ఆపై గొంతుకోసుకున్న ప్రియుడు
- ఆదిత్యనగర్ లో చోటుచేసుకున్న ఘటన
- చికిత్స పొందుతున్న ముగ్గురు
నమస్తే శేరిలింగంపల్లి: తనను దూరం పెడుతుందని ప్రియురాలు, ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి.. అదే కత్తితో తన గొంతు కోసుకున్న సంఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గుంటూరు జిల్లా రేపల్లె కు చెందిన వైభవి(19), సందీప్ ( 20) గత 3 ఎండ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వైభవి సందీప్‌ను దూరం పెడుతూ వస్తున్నది. బబ్లు ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసింది. దీంతో సందీప్ కక్ష పెంచుకున్నాడు. వేరే ఫోన్ నంబర్ల నుంచి వైభవికి కాల్ చేసి చంపేస్తానని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసేజ్‌లు పంపేవాడు. దీంతో భయాందోళనలకు గురైన వైభవి మే నెలలో తన సోదరుడు, తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చి మియాపూర్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నది. అయితే మంగళవారం ఉదయం 10.30 కు హైదరాబాద్ చేరుకున్న సందీప్ వైభవి ఇంటికి వచ్చి ఆమె తల్లి శోభ, వైభవి తో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో కత్తితో వైభవి, ఆమె తల్లి పై దాడి చేశాడు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం సందీప్ అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. గాయపడిన ముగ్గురిని కొండాపూర్ కిమ్స్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.