ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ఉచిత మంచి నీటి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సంకల్ప్ అపార్ట్మెంట్స్ లో రూ.2 కోట్ల 10 లక్షల తో నూతనంగా చెపట్టబోయే మంజీర మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి పాల్గొని శంకుస్థాపన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో సంకల్ప్ అపార్ట్మెంట్స్ వాసుల ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అన్నారు.

అసంపూర్తిగా మిగిలిపోయిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించడం ద్వారా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నెలకు 20,000 ల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చేసి లబ్ది పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని , ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కలిపించాలని, పేదవాడలలో నివసించే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్ , మేనేజర్ యాదయ్య, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, గౌస్, సంకల్ప్ వాసులు సుందర్ రావు, చైతన్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here