నమస్తే శేరిలింగంపల్లి: భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్, హనీఫ్ కాలనీలలో రూ.45 లక్షల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ మేర భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, మేనేజర్ సందీప్ గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, రమేష్ పటేల్, రక్తపు జంగంగౌడ్, ప్రసాద్, తిరుపతి, శ్రీనివాస్ చౌదరి,రజినీకాంత్ ఎర్రరాజు, అశోక్ సాగర్, సయ్యద్ ఉస్మాన్, హిమమ్, రవి శంకర్ నాయక్, జాఫర్, సమద్, అహ్మద్, డా. సుదర్శన్, సంజీవ, ముక్తార్, షేక్ రఫీ, వసీమ్, అక్షయ్, అభి , కార్యకర్తలు,వార్డు మెంబర్లు, ఏరియా,కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.