- పేద విద్యార్థులకు ఉన్నత మౌలిక వసతులు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యం : బిఆర్ఎస్ యువ జన నాయకుడు ఆదిల్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లోని ఏంపిపియస్ ప్రభుత్వ పాఠశాల వద్ద ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు కల్పన దిశగా పనులను చేయించారు. ఈ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ ప్రారంభించారు. మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు ఆదిల్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ,
ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా మెరుగుపరచి, అవసరామ్ మేరకు అన్ని రకాల మౌలిక వసతులు సమాకుర్చటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రతి పేద విద్యార్థికి చదువు పై ఆసక్తి కలిగేలా పాఠశాలల రూపు మార్చి, శుభ్రతతో కూడిన పాఠశాల అందిచడం కోసం కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ, యువ నాయకులు ఆదిల్ పటేల్ విచ్చేసిన ప్రముఖులు, స్థానిక నాయకులు అంతా కలసి కాసేపు విద్యార్థులుగా మారి, స్థానిక ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, మంచిగా చదువుకొని, ఉన్నత విద్యావంతులు అయ్యి, ఉన్నత ఉద్యోగాలు చేయాలని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా టిఎస్ఈడబూల్యూఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. కుమార్ గౌడ్, ఏఈ పి. విక్రమ్, ఏఈ ఏ. శ్యామ్, మండల విద్యాధికారి శ్రీ వెంకటయ్య, మియాపూర్ పాఠశాలల సముదాయ ప్రధానోపాధ్యాయురాలు కే. వసుంధర, స్థానిక పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్ వి. ఈశ్వరి, మార్తాండ్ నగర్ ప్రభుత్వ ఏంపిపియస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జె. బలరాం యాదవ్, వైస్ ప్రెసిడెంట్ గఫూర్, లింగంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రూప రెడ్డి, మొహ్మద్ అలీ, తాడెం మహేందర్, రజనీకాంత్, తిరుపతి యాదవ్, పంతం గణపతి, శారదా, మంగళరపు తిరుపతి, బండారి అక్షయ్ అభి పాల్గొన్నారు.