పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే..కేంద్ర ప్రభుత్వ ధ్యేయం:బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ పై పత్రికా సమావేశం నిర్వహించారు. చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ వీరేందర్ గౌడ్ తో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నారు. నిరుద్యోగుల కోసం నేషనల్ అప్రెంటిస్ షిప్ స్కీం తీసుకువస్తామని హామీ ఇవ్వడం, మూడేళ్ల పాటు DBT ద్వారా నిరుద్యోగులకు సాయం చేస్తామని , యూత్ లో నైపుణ్యాలు పెంచే విధంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ను ప్రారంభిస్తామన్నారు, ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త చెబుతూ గత సంవత్సరం #PMAY ఈ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించగా ఈ సారి ఆ మొత్తాన్ని 66శాతం పెంచింది. ప్రస్తుత బడ్జెట్ లో రూ.79వేల కోట్లు కేటాయించింది. మూడు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులవుతారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2.50 లక్షల రూపాయలను మూడు విడతలుగా సాయం చేస్తుందనీ తెలిపారు.

చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ వీరేందర్ గౌడ్ తో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

అలాగే దేశ వ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని , ఇలా పేద , మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరేవిధంగా ఉందని, బడ్జెట్ పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here