నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్ర నగర్ వికర్ సెక్షన్ కాలనీలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు. కాలనిలో నెలకొన్న సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , సిసిరోడ్ల అవసరం ఉందని వాటిని పరిష్కరించాలని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు వెంటనే కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు ఏర్పాటుకు నివేదికను రూపొందించి సమస్యలు పరిష్కరించాలని సుచించారు.
ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, చందానగర్ మున్సిపల్ ఇంజనీర్ అధికారులు ఈఈ శ్రీకాంతి , డిఇ ప్రవిణ్ , ఏఈ సంతోష్, బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.