సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి వేదిక ‘మన్ కీ బాత్’

  • కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్ కి బాత్ చారిత్రాత్మక 100వ ఎపిసోడ్‌ స్ఫూర్తి కలిగిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కార్పొరేటర్ కార్యాలయంలో వీక్షించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి మాటల ద్వారా అనేక నిజ జీవిత గాథలను, అజ్ఞాత యోధుల కథలను వింటూ ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. దేశానికి, సమాజానికి సేవ దిశగా తమనుతాము పునరంకితం చేసుకుంటూ, జాతి నిర్మాణంలో తమవంతు కృషి చేసేలా ప్రేరణ పొందుతున్నారని తెలిపారు.

నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని తిలకిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్ కార్యక్రమం వేదికైందని ప్రధాని మోడీ అన్నట్లు తెలిపారు. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందని అన్నారు. ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారం తనని చాలా ప్రభావితం చేసిందని మోడీ చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, శివ సింగ్, గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు జలేందర్ రెడ్డి, రంజిత్ పూరి,శ్యామ్ యాదవ్ ,రాజు, ప్రసాద్,దార్గుపల్లి అనిల్, ప్రసాద్, సురేష్, దేవర్శి టిప్పు, చత్రోభా, నర్సింగ్, గుండప్ప, సాయిరాం, కరణ్, లలిత, స్థానిక ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here