శ్రీ కృష్ణ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

  • 50 టీంలతో 25 మ్యాచ్ లు.. వారం రోజులపాటు కొనసాగనున్న మ్యాచ్ లు
శ్రీ కృష్ణ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభిస్తున్న మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, వి.వైభవ్ కృష్ణ

నమస్తే శేరిలింగంపల్లి: చందనగర్ పీజేఆర్ స్టేడియం వద్ద శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, వి.వైభవ్ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో 2001వ సంవత్సరంలో శ్రీ కృష్ణ యూత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి యువతకు మంచి మార్గంలో నడిపేందుకు, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనలో 23సంవత్సరాలుగా ముందుకు సాగుతున్నామని, శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించే విధంగా ఎన్నో స్పోర్ట్ మీట్ కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఈ టోర్నమెంట్ వారం రోజుల పాటు పీజేఆర్ స్టేడియంలో జరుగుతుందని, ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న 50టీంలతో 25మ్యాచ్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీ కృష్ణ యూత్ అడ్వైసర్ డి.రాజు, చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు, అధ్యక్షుడు భీమని ఆదిత్య ముదిరాజ్, అధ్యక్షులు యాదగిరి, శివ గౌడ్, బాలకృష్ణ, మల్లేష్, విజయేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్, కిషోర్, జయసాయి, సభ్యులు శివనంద్ రెడ్డి, సాయి, తరుణ్, నరసింహ రెడ్డి, పింటు, లక్ష్మ, శ్రీ కృష్ణ కాలనీ సభ్యులు వెంకటేష్ ముదిరాజ్, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here