- 24 వరకూ ప్రదర్శన కొనసాగింపు
- పాత మైన్ డైమండ్ ఆభరణాల మార్పిడిపై 100 శాతం విలువ పొందవచ్చు : షోరూం హెడ్ దీపక్
- కొత్తవాటిపై 25 శాతం తగ్గింపు లభిస్తుందని వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్ తమ చందానగర్ షోరూమ్ లో బుధవారం “మైన్ డైమండ్స్” షోని ప్రారంభించింది. చందానగర్ షోరూములో ఏర్పాటు చేసిన ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ముఖ్య అతిధులు హాజరై ప్రారంభించారు.
ఈ డైమండ్ షో లో నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, ప్లాటినం ఆభరణాలు ప్రదర్శనకు ఉంచారు. ఈనెల 20 నుంచి 24వరకూ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ దీపక్ తెలిపారు.
అంతేకాక పాత మైన్ డైమండ్ ఆభరణాల మార్పిడిపై వినియోగదారులు 100% విలువను పొందవచ్చని, కొత్తగా కొనుగోలు చేసిన డైమండ్ విలువపై 25% వరకు తగ్గింపు లభిస్తుందని, 22 కారెట్ల పాత బంగారం మార్పిడిపై 0 % తగ్గింపును పొందవచ్చని పేర్కొన్నారు.