ఘనంగా ధర్బారన్యేశ్వరా స్వామి శనిపేయర్చి వేడుకలు

  • సోలిస్ ఐ కేర్ నిర్వాహకులు నందనంపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో లక్షన్నర మందికి అన్న ప్రసాద వితరణ
  • ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : పాండిచ్చేరి లోని కరాయికల్ జిల్లా తిరునల్లార్ లోని శ్రీ ధర్బారన్యేశ్వరా స్వామి దేవస్థానం శ్రీ శనేశ్వరా భగవాన్ స్థలంలో మంగళ, బుధవారాలలో శనిపేయర్చి ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలోని సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ ప్రైవెట్ లిమిటెడ్, తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తధ్వర్యంలో లక్ష 50 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, సోలిస్ కంటి ఆసుపత్రి చైర్మన్ రాము, మాజీ లేబర్ కమీషనర్ శ్రీనివాస్, విహెచ్ పి ఇంచార్జీ రాఘవులు, ప్రముఖ పారిశ్రమిక వేతలు ముప్పవరపు సురేష్ బాబు, భరత్ షా(బెలిజ్జియం), సురేష్, ప్రముఖ ఆడిటర్ శివరాం, హెల్త్ అడ్డా హాస్పిటల్స్ కోటేశ్వర్ రావు, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, సోలిస్ కంటి సిబ్బందితో పాటు వెయ్యి మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈసీఐఎల్ చౌరస్తాలోని సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ ప్రైవెట్ లిమిటెడ్, తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

రెండు రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వీరామంగా పాండిచ్చేరి ప్రభుత్వ అధికారుల సహకారంతో జరుగుచున్నది. పోలీస్ అధికారులు విజయేందర్ రెడ్డి, చంద్రశేఖర్, గజేందర్ తదితరులు బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించాలని తెలిపారు

శ్రీ ధర్బారన్యేశ్వరా స్వామి దేవస్థానం శ్రీ శనేశ్వరా భగవాన్ స్థలంలో శనిపేయర్చి వేడుకలలో పాల్గొన్న భక్తులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శనిపేయర్చి ఫెస్టివల్ సందర్భంగా లక్షలాదిమందికి అన్నదాన కార్యక్రమం చేపట్టిన సోలిస్ ఐ కేర్ నిర్వాహకులు నందనంపాటి రామాంజనేయులుని ప్రత్యేకంగా అభినదించామని తెలిపారు. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here