మహిళా మోర్చా విభాగం మరింత బలోపేతం

  • మహిళా మోర్చా సమావేశం అనంతరం పార్టీ లోకి చేరికలు
  • పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ బిజెపి పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపెళ్లి పద్మ ఆధ్వర్యంలో మహిళా మోర్చా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం, వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకు రావడానికి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన బేటి పడావ్ -బేటి బచావ్ , సుకన్య సమృద్ధి యోజన, మాతృ వందన యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన మొదలగు స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేయాలని మహిళా మోర్చా డివిజన్ నాయకురాళ్ల కు సూచించారు. కార్యక్రమంలో కొండాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ నుంచి పార్టీలో చేరిన మహిళలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వరలక్ష్మి, అరుణ, రేణుక, కవిత, మహేశ్వరి, కృష్ణప్రియ , మాధవి, శ్రీలత రెడ్డి, విద్య పాండే, మమత, మాధవి లత, దేవి రెడ్డి, స్వప్న, సుజాత పాల్గొన్నారు.

మహిళా మోర్చా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here