- శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ , బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, నవతారెడ్డి రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శంకర్ నగర్ కాలనీలో శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్, మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతా రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా స్థానిక కాలనీ వాసులు భిక్షపతి యాదవ్ అభిమానులు వారి సమక్షంలో బిజెపిలో చేరారు. నియోజకవర్గం లో, కాలనీలలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని , సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం, మంజీరా వాటర్ లైన్లు ఇలా అన్ని విధాలుగా అభివృధి జరిగిందని అన్నారు. ప్రజలకు దేశమంతా మేలు చేకూరుస్తున్న ప్రభుత్వం బీజేపీ అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి , భారత దేశాన్ని శక్తి వంతమైన దేశం తీర్చిదిద్దుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి కేసిఆర్, కే. టీ.ఆర్, ఎమ్మెల్యే గాంధీ అవినీతిని, ప్రజలందరికీ తెలపాలని సూచించారు. కార్యక్రమంలో చందర్ రావు యాదవ్, పోచయ్య, గౌస్ బాయ్, ఎస్ఎస్ రావు, సంజీవరెడ్డి, పంతులు, రవి, కె ఎస్ రాజు, సంధ్యారాణి, శివ పూర్ణయ్య, ఉమాహేశ్వరరావు, పార్థసారథి, ఏవీఎస్ రావు, బసవరాజు , రామాంజనేయులు పాల్గొన్నారు