పురుషులతో సమానంగా మహిళలు గౌరవించబడాలి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలు సమాజంలో పురుషులతో సమానంగా గౌరవించబడినప్పుడే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో మహిళలతో కలిసి కేక్ కట్ చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

మనకు వారసత్వంగా వచ్చిన పితృస్వామికి భావజాలం మూలంగా ఆడపిల్లలు తీవ్రమైన వివక్షకు గురి కాబడుతున్నారని, ఇది మన సమాజానికి మన బిడ్డల భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, చంద్రకళ, భాగ్యలక్ష్మి, సౌజన్య, జయ, శశికళ, రమాదేవి, కుమారి, కళ్యాణి, రోజారాణి, సుధారాణి, రాములమ్మ, బస్వరాజ్ లింగయత్, గోపాల్ యాదవ్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here