నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయండి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

  • సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్, గోపి నగర్, మసీదు బండ RV పంచాజన్య అపార్ట్ మెంట్, క్రాంతి వనం, నార్నె ఎస్టేట్స్ కాలనీలలో రూ. 4 కోట్ల 71 లక్షల 16 వేల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, సీఎం కెసిఆర్ మార్గదర్శకం లో.. మంత్రి KTR సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని.. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఆదర్శ్ నగర్ కాలనీలో రూ.30 లక్షలు, గోపి నగర్ కాలనీ లో రూ.91. 56 లక్షల అంచనా వ్యయంతో సీసీ సీసీ రోడ్ల నిర్మాణం.. మసీదు బండ RV పాంచజన్య నుంచి అపర్ణ హైట్స్ వరకు రూ.49.60 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే వరద నీటి కాల్వ నిర్మాణం, క్రాంతి వనం కాలనీ లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం , నార్నె ఎస్టేట్స్ కాలనీ లో రూ. 1 కోటి అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామస్వామి యాదవ్, సోమదాస్, విరేశం గౌడ్, రాజేశ్వరమ్మ, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పద్మారావు, పొడుగు రాం బాబు, కొండల్ రెడ్డి , విరేశం గౌడ్, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, రమణయ్య, సత్యనారాయణ, యాదగౌడ్, KN రాములు, నటరాజు, పవన్, మహేష్, రజనీకాంత్, శ్రీనివాస్ చౌదరీ, గోపాల్ యాదవ్, రవి యాదవ్, జమ్మయ, నరసింహ రెడ్డి, రాంచందర్, కాలనీ వాసులు రమణి, అనిత, రాజు, మహేష్, భాస్కర్, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు పాల్గొన్నారు.

సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here