- ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: ఎంసిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ మహమ్మద్ గౌస్ ద్వితీయ వర్ధంతి సభ, స్థూపావిష్కరణ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా తుడుం అనిల్ కుమార్ మాట్లాడారు. గౌస్ 1965లో వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామంలో పేద మైనార్టీ కుటుంబంలో జన్మించారని, ఆ రోజుల్లోనే హిందీ పండిత్ ఎంఏ వరకు చదివారని, చదువుకునే సమయంలోనే విద్యార్థి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1980 ప్రాంతంలో యువజన సంఘంలో చేరి యువతను సమీకరించి అనేక మూఢవిశ్వాసాలకు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే నాటికలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో తర్ఫీదు పొంది విద్యార్థి, యువతను ప్రజలను చైతన్య పరచారని పేర్కొన్నారు. కొత్తూరు వరంగల్ జిల్లాలో 51 ఫీట్ల స్థూపావిష్కరణ, రెండవ వర్ధంతి బహిరంగ సభను ఈనెల 19న నిర్వహిస్తున్నామని, ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండ్ర కళావతి, పల్లె మురళి, అంగడి పుష్ప, ఇ దశరథ నాయక్, కన్నా శ్రీనివాస్, బి. విమల, తుడుం పుష్పలత, జి శివాని, ఎండి సుల్తానా, బేగం రజియా బేగం పాల్గొన్నారు.
