- లహరి హోమ్స్ , ఆడి ఏమరోల్డ్ అపార్ట్ మెంట్ సొసైటీ వాసుల ఆవేదన
నమస్తే శేరిలింగంపల్లి: వర్షం పడిందంటే చాలు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, జిహెచ్ ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండలోని లహరి హోమ్స్ , ఆడి ఏమరోల్డ్ అపార్ట్ మెంట్ సొసైటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు, మురుగు నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవటం వల్ల ఆ నీటిలో మునిగి తమ వాహనాలు చెడిపోతున్నాయని రాష్ట్ర యువమోర్చ కోశాధికారి రఘునాథ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు ఆయా కాలనీవాసులు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పుట్టలయ్య, కార్యదర్శి క్రాంతి, శ్రీనివాస్, బీజేపీ డివిజన్ కార్యదర్శి కరణ్ గౌడ్, యువమోర్చ అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, సొసైటీ పెద్దలు పాల్గొన్నారు.
