నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు నుండి విచ్చేసిన హంసిని డాన్స్ అకాడమీ పూజ ఘోష్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన అలరించింది. సంకీర్తన అలరింపు, పరంధామనే, నర్సింహా కౌతం, అష్ట లక్ష్మి, అర్ధనారీశ్వరం, శృంగార పురాధీశ్వర, మహా కాళీ, దేవర్ణం, చూడరు, తిల్లాన అంశాలలో గురువు పూజ ఘోష్ తో పాటు తేజశ్రీ, సూక్ష, ధ్రిటి, నిర్మయి, విశాఖ, మానస వారు ప్రదర్శన చేసి మెప్పించారు.
సాంస్కృతిక ప్రదర్శనలో కళాకారులు