అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. శ్రావణ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లోని శ్రీ శ్రీ మైసమ్మ పోచమ్మ పెద్దమ్మ దేవాలయం, గౌలిదొడ్డి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం, ఎల్లమ్మ దేవాలయం కేశవ నగర్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం, రేణుక ఎల్లమ్మ దేవాలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక అన్నారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ సీనియర్ నాయకులు, ఆయా దేవాలయ కమిటీ సభ్యులు, ఇందిరా నగర్ గ్రామం వాసులు, గౌలిదొడ్డి గ్రామం వాసులు, కేశవ నగర్ గ్రామం వాసులు, స్థానిక నేతలు, కాలనీ వాసులు, భక్తులు, పిల్లలు పెద్దలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here