6 నెలల తరువాత అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

  • 57వ రోజు కొనసాగిన గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర
  • రామాంజనేయ ఆలయం లో పూజలు.. అనంతరం పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: గడప గడపకు బీజేపీ, ప్రజల గోస – రవన్న భరోసా ప్రజాయాత్ర 57 వ రోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగం పేట్, శ్రీరామ కాలనీ, మేఘహిల్స్ లలో కొనసాగింది. ఈ సందర్బంగా ఇంటి ఇంటికి కరపత్రాలను పంచుతూ, బి.ఆర్.ఎస్ అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ , కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసిఆర్ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ దొంగ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తారని, కేజీ టు పి.జి , మోడల్ స్కూల్స్ , జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , మండలానికో 100 పడకల హాస్పిటల్ , నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, గిరిజన బంధు, దళిత బంధు, టెక్స్టైల్ జోన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇలా అన్ని హామీలు ఇచ్చారు , వీటిలో ఒక్కటైన నెరవేర్చారా ..అని ప్రశ్నించారు.

ఈ నియోజకవర్గంలో గతంలో భిక్షపతి యాదవ్ హయాంలో స్కూల్స్ , అంగన్వాడీ , రోడ్లు, డ్రైనేజీ, మంజీరా లైన్లు, స్ట్రీట్ లైట్స్, రేషన్ షాపులు ,ఇలా ఆయన చేసిన అభివృద్దే కానీ వీళ్ళు 9 సంవత్సరాలలో ప్రజలకు ఏలాంటి ఉపయోగకరమైన పనులు చేయలేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, భారతీయ జనతా పార్టీ ని అఖండ మెజారిటీతో తథ్యం అన్నారు. ఈ పాదయాత్రలో నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , కంటేస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, ఏల్లేష్ , సీనియర్ నాయకులు చంద్ర శేఖర్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, విజయ్ , అశోక్, మంజునాథ్, గోపాల్, మధు యాదవ్, మదనా చారి, శ్రీశైలం కుర్మ , పద్మ, యాదయ్య , వినయ్ బాబు, శ్రీనివాస రెడ్డి, ఆనంద్, శివ, మహేందర్, నరేష్, భారతి , పార్వతి, నాగులు ,మల్లీశ్వరి, లోకేష్, కృష్ణ , బాలు నాయక్ , నరేష్, వెంకటేష్, సత్య కీర్తి, రంజిత్, సుమన్, అజయ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here