- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. బెంగాలీ హస్తకళా ఉత్పత్తులు
- నోరూరించిన ఫుడ్ స్టాల్ల్స్
నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో ఉత్తరన్ బంగియ బెంగాలీ సమాజం ఆధ్వర్యంలో పొయిల బైశాఖ్ బెంగాలీ నూతన సంవత్సరం పండుగను నిర్వహించారు. రవీంద్ర సంగీత్ , బెంగాలీ పాటలు, రవీంద్ర నృత్యాలను , బెంగాలీ ఫోక్ డాన్స్ , మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా బెంగాలీ కాటన్ సారీస్, కుర్తిస్ , బెంగాలీ హస్తకళా ఉత్పత్తులు, జ్యువలరీ , స్టాల్ల్స్ తో పాటు పసందైన బెంగాలీ ఫుడ్ ని అందించారు. ఎగ్ రోల్, ఫిష్ చాప్, బిర్యానీ, కట్లెట్, షాప్, ఫ్రైడ్ వెజ్, పూరి సబ్జి, బెంగాలీ స్వీట్స్, స్వీట్ పెరుగు, రసగుల్లా,మిష్టి దోయి , శీరఖండ్, రసమలై, గులాబ్జామున్ మొదలైన ఫుడ్ స్టాల్ల్స్ నిర్వహించారు. జంట నగరాలలో ఉన్న బెంగాలీలు సాంప్రదాయ వస్త్ర లలో వచ్చి పాల్గొన్నారు.