- రసవత్తరంగా టి -20 ఫ్రెండ్‌షిప్ కప్ టోర్నమెంట్ సెమి ఫైనల్ మ్యాచ్
- ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైన టీఎస్ సివిల్ సర్వీసెస్
- వరుస ఫామ్ లతో చెలరేగిన సి.వంశీ మోహన్ రెడ్డి
- ఇప్పటికి నాలుగు అర్ధ సెంచరీలు
- 323 పరుగులతో టోర్నమెంట్ లీడర్ బోర్డులో రెండో స్థానం టీఎస్ సివిల్ సర్వీసెస్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్
నమస్తే శేరిలింగంపల్లి: టి -20 ఫ్రెండ్‌షిప్ కప్ టోర్నమెంట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీలు సెమి ఫైనల్ దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా టీఎస్ సివిల్ సర్వీసెస్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ & ఎస్ బి ( హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్) జట్ల మధ్య ఆదివారం జరిగిన 2వ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. అంబర్‌పేట్‌లోని వాటర్ వర్క్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ మ్యాచ్ లో టీఎస్ సివిల్ సర్వీసెస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 139/6 స్కోరు చేసింది. 140 పరుగుల లక్ష్యంతో హెచ్ ఎం డబ్ల్యు ఎస్ & ఎస్ బి బరిలో దిగింది. 19 ఓవర్లలో 140/3 స్కోరు చేసి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఐతే అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన టీఎస్ సివిల్ సర్వీసెస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సి.వంశీ మోహన్ రెడ్డి 51(59 బంతుల్లో 5 ఫోర్లు)తో నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. లీడర్ బోర్డు లో రెండో స్థానంలో నిలిచాడు.