నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహించిన వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రవల్లిక శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
జయము జయము, భజమానస, జతిస్వరం, బాలగోపాలా తరంగం, తక్కువేమి మనకు, మరకతమణిమయ, వినాయక శబ్దం, పలుకే బంగారమాయెనా, కృష్ణ లీలలు, తిల్లాన అష్ట లక్ష్మి స్తోత్రం మొదలైన అంశాలను ప్రవల్లిక, యుక్త, మేధ, సంచిత, హంసిని, చిన్మయి, నక్షత్ర, భవాని, జెశ్విత, శివాని, మాన్య, అనన్య, చంద్రిక, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.