- ఎక్కడ చూసినా సమస్యలే
- గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్ , కాకతీయ హిల్స్ లలో గడప గడపకు బీజేపీ, ప్రజల గోస – రవన్న భరోసా ప్రజాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఇంటి ఇంటికి కరపత్రాలను పంచుతూ, బి.ఆర్.ఎస్ అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ , కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పర్యటించారు. ఈ పాదయాత్రలో నవభారత్ నగర్ నుండి కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ లో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మన నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 40 శాతం నిధులు సమకూరుతున్నాయని, అలాంటి చోట ఎక్కడ చూసినా సరైన రోడ్లు లేవని, డ్రైనేజీ వ్యవస్థ అడ్వాన్నంగా ఉందని, సరిపడా శానిటైజేషన్ సిబ్బంది లేరని తెలిపారు. ఎవ్వరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని, మనకు ప్రజాప్రతినిధులు , అధికారులు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. తాము గెలిచిన తదనంతరం పాదయాత్రలో తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ఒక ప్రణాళికా రూపొందించుకొని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చ ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.