నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేసిన ప్రజల అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి కాలనీ అసోసియేషన్ సభ్యుడు మోహన్ రావు పాట రూపంలో అభిమానం చాటాడు. అనంతరం జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సందర్బంగా ఆయనకు శ్రీరామ్ నగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రెడ్డి, క్రాంతికుమార్, నరేందర్ రెడ్డి, మోహన్ రావు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని, ఆ సమస్య వచ్చిన తన దృష్టికి తెస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.