హైటెక్ హంగులతో అందుబాటులోకి ‘ఈ-గరుడ’

  • ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, (టీఎస్‌ఆర్టీసీ) చైర్మ‌న్‌ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
పుష్ప‌క్ బస్ పాయింట్ వద్ద ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఆర్టీసి ఏసీ బ‌స్సులను ప్రారంభిస్తూ…

నమస్తే శేరిలింగంపల్లి: అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో ప్రయాణికులకు సేవలందించేందుకు ‘ఈ-గరుడ’ ముందుకొచ్చింది. మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ప‌క్ బస్ పాయింట్ వద్ద ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఆర్టీసి ఏసీ బ‌స్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, (టీఎస్‌ఆర్టీసీ) చైర్మ‌న్‌ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సంద్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఇక్కడి ప్రాంత ప్రజల సౌకర్యార్థం మియాపూర్ లో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి రూ. 25 లక్షలు కేటాయించమని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ బస్ టెర్మినల్ కు కృషి చేయాలని, బస్ టెర్మినల్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం పొందేలా కృషి చేస్తానని తెలిపారు. హైద‌రాబాద్ – విజ‌య‌వాడ మార్గంలో మొత్తం 50 ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని టీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యించిందని, దాంట్లో భాగంగా ఈ రోజు నుండి 10 బ‌స్సుల‌ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని ఈ సందర్బంగా సంస్థ ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ డి. శ్రీధర్, ఆర్ ఎం (ఓ) / ఆర్ ఆర్ డి.రాజు, ఆర్ ఎం (ఎం) / ఆర్ ఆర్ సాయిరామ్ డిఎం / ఎంవైపి 1 రామయ్య సింగం, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పుర్ షోత్తం యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మర్రపు గంగాధర్ రావు, బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు , మహమ్మద్ ఖాజా,
రోషన్ , ఉమ , సుప్రజ , స్వరూప., శివ ముదిరాజ్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here