నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా రెండవ దశ ఉదృతి విషయమై ప్రత్యేకంగా చర్చించారు. డివిజన్లో ఆరోగ్య కేంద్రాలలో వాక్సినేషన్ పాయింట్స్ పెంచాలని, 18 సంవత్సరములు వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా డివిజన్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, వెంటనే అధిక మొత్తంలో హైపోక్లోరైడ్ ద్రావణ ట్యాంకంర్లను పంపించి అడుగడుగున పిచికారీ చేయించాలని జడ్సీని కోరుతూ కార్పొరేటర్ వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ రవికిరణ్ తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.