హ‌పీజ్‌పేట్ అర్భ‌న్ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్‌లో ప‌క‌డ్భందీగా కొన‌సాగుతున్న కోవిడ్ వ్యాక్సినేష‌న్…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌లోని అర్భ‌న్ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప‌క‌డ్భందిగా కొన‌సాగుతుంది. వైధ్యాధికారి డాక్ట‌ర్ విన‌య్ బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 45 సంవ‌త్సరాల పైబ‌డిన వారికి సిబ్బంది టీకా ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ విన‌య్ బాబు మాట్లాడుతూ ఆరోగ్య‌సేతు, కోవిన్ వెబ్‌సైట్ ద్వారా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్న వారికి మాత్ర‌మే టీకా వేస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌స్థుతం కోవీషీల్డ్ టీకా అందుబాటులో ఉన్న నేప‌థ్యంలో మొద‌టి, రెండ‌వ డోసు వారికి ఆ వ్యాక్సిన్ ఇస్తున్నామ‌ని అన్నారు. కోవాక్జీన్ అందుబాటులో ఉన్నంత‌మేర రెండ‌వ డోసు వారికి పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. మే 1 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారంద‌రికి వ్యాక్సిన్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని, అర్హులైన వారంద‌రు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని, రిజిస్ట్రేష‌న్ లేని వారు సెంట‌ర్‌కు వ‌చ్చి అర్హులైన వారిని ఇబ్బందుల‌కు గురిచేయ‌వ‌ద్దని సూచించారు.

వ్యాక్సినేష‌న్‌కోసం బారులు తీరిన 45 ఏళ్ల పైబ‌డిన వారు
వ్య‌క్సిన్ వేయించుకున్న వారికి సూచ‌న‌లు చేస్తున్న వైధ్యాధికారి డాక్ట‌ర్ విన‌య్ బాబు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here