శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): పట్టణ వికలాంగుల సాధికారత కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి జోనల్ ఆఫీస్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 24 సర్కిల్ పరిధిలో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం 2025 కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాల్గొని దివ్యాంగులను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగిందని, ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన జరుపుకుంటారు అని, దీన్ని యునైటెడ్ నేషన్స్ సంస్థ 1992 లో ప్రారంభించిందని, సమాజ అభివృద్ధికి వికలాంగులకు అనుకూలమైన సమాజాన్ని ఏర్పరచడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. వికలాంగుల హక్కులు, గౌరవం, సమాన అవకాశాలు, సమాజంలో పూర్తి మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉమాదేవి, కూకట్ పల్లి ప్రాజెక్ట్ ఆఫీసర్ భోగేశ్వర్లు, పట్టణ స్థాయి వికలాంగుల ఫెడరేషన్ అధ్యక్షుడు లక్ష్మీపతి, సెక్రటరీ బాలాజీ, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ పాపన్న గౌడ్, ముస్తఫా సుజాతా మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






