శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ఎంఏ నగర్‌లో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద అరుణ్ గురుస్వామి సమక్షంలో బచ్చలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు బచ్చలి శ్రీనివాస్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.







