సావిత్రిబాయి పూలె ఆశ‌య సాధ‌న‌కు కృషి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సావిత్రిబాయి ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ సురభి కాలనీ ఎంపిపిఎస్ పాఠశాలలో సామాజిక ఉద్యమకారిణి సావిత్రిభాయి పూలె జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఎంపిపిఎస్ పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు కార్పొరేటర్ శాలువా కప్పి సత్కరించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలె ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యత కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్మ‌న్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, ఎంపిపిఎస్ పాఠశాల ఇంచార్జి హెచ్ఎం పాండురంగా రెడ్డి, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆశ్రఫ్, మౌనిక, మల్లికాంబ, వనిత, మాధవి, మహేశ్వరి, పూజిత, చాముండేశ్వరి, శ్రీలత, మహిళలు కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here