శేరిలింగంపల్లి, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆర్టీసీ కాలనీలో మంజీర పైప్ లైన్ రోడ్డును ఆయన పరిశీలించారు. హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మై హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ సభ్యులతో మంజీర పైప్ లైన్ రోడ్డు అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మంజీర పైప్ లైన్ అభివృద్ధికి రూ.3.92 కోట్లతో ఈ వారంలో పనులు ప్రారంభించి ప్రజలకు రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే రెండు భాగాలుగా మంజీర పైప్ లైన్ సీసీ రోడ్డు నిర్మాణం పనులు సుమారుగా రూ.1.97 కోట్లతో మై హోమ్స్ నుండి విజేత సూపర్ మార్కెట్ వైశాలి నగర్ వరకు, రూ.1.95 కోట్లతో వైశాలి నగర్ నుండి హఫీజ్ పేట్ ఫ్లైఓవర్ వరకు ఈ వారంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. లింగంపల్లి బస్ స్టాప్ బీఆర్ గ్యాస్ నుండి హుడా కాలనీ ఓల్డ్ పోలీస్ స్టేషన్ వరకు రూ.1.69 కోట్లతో సీసీ రోడ్డును కూడా మంజూరు చేయించి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శేఖర్ ముదిరాజ్, కరుణాకర్ రెడ్డి, కృష్ణ, మై హోమ్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్, శ్రీశైలం, మురళి, సాయినాథ్ గౌడ్, కృష్ణ మూర్తి కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.