అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచింది గెలుపే కాదు: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మున్సిపల్ ఎన్నికల్లో భారాస మంచి ఫలితాలు సాధించిందని శేరిలింగంపల్లి యువ నేత, భారాస పార్టీ సీనియర్ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ అన్నారు. భారాస కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కితాబిచ్చారు. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకున్నామన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో గులాబీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన కుట్రలను తట్టుకొని భారాస 750 పైగా వార్డుల్లో విజయం సాధించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్న ఆయన.. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయని అన్నారు. చాలాచోట్ల అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. డబ్బుతో గెలిచిన ఎన్నికలు ఎప్పటికీ నిలబడవన్నారు. వచ్చే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా.. అన్ని డివిజన్ లను గెలుచుకునేలా పోరాటం చేస్తామని చిర్రా రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here