కార్పొరేట‌ర్ రాగం నాగేందర్ యాదవ్ కు స‌న్మానం

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రెండవ సారి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గా గెలుపోందిన రాగం నాగేందర్ యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షులు రాజేందర్, జమీర్, నాయకులు జంగీర్, శ్రీధర్, రవి పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ రాగం నాగేందర్ యాదవ్ ను స‌న్మానించిన ఆటో యూనియన్ సభ్యులు

దూబే కాల‌నీ వాసుల స‌న్మానం…
శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన రాగం నాగేందర్ యాదవ్ ను దూబే కాల‌నీ వాసులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దూబే కాల‌నీ అధ్యక్షుడు అనిల్ కుమార్ ముదిరాజ్, మల్లికార్జున్ చారి, ప్రవీణ్, వెంకటేశ్వరరావు, యాదగిరి, హేమంత్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, విష్ణువర్థన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, పట్లోళ్ల‌ నర్సింహారెడ్డి, సాయి పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ రాగం నాగేందర్ యాదవ్ ను స‌న్మానించిన దూబే కాల‌నీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here