SIR-2026: ఓటరు వివరాల నమోదు పూర్తి చేసిన బోయిని అనూష మహేష్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా బీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ తమ ఓటర్ కార్డు వివరాలను పూరించి, సంబంధిత బీఎల్‌వో రోషన్ కు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హ ఓటరు పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని, ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు పూర్తి చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here