కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని జాగృతి కాలనీ రంగన్న కుంటను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం సందర్శించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు తమ సొంత నిధులతో సుందరీకరణ పనులను చేపట్టడం అభినందనీయమన్నారు. ఇతర కాలనీవాసులు జాగృతి కాలనీ వాసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శేరిలింగంపల్లిలోని చెరువులు, కుంటలను ఇప్పటికే సుందరీకరిస్తున్నామని తెలిపారు. చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ నిర్మించడం జరుగుతుందని, చిన్నారులకు ఆట స్థలాలు నిర్మిస్తామని అన్నారు. చెరువుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ఈ సందర్భంగా గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు శశాంక్, జ్ఞాన్ తేజ, రామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.







