
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా ఓల్డ్ హఫీజ్ పెట్ కు చెందిన మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ నియమితులయ్యారు. శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు ఏం.బిక్షపతి యాదవ్ సమక్షంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏం.రవికుమార్ యాదవ్ అల్లావుద్దీన్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని సేవలు చేస్తున్న కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అల్లావుద్దీన్ మాట్లాడుతూ రవి కుమార్ యాదవ్ నేతృత్వంలో మైనారిటీలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ ఇన్చార్జి గంగుల నరసింహ యాదవ్, పిసిసి సెక్రెటరీ రాధాకృష్ణ యాదవ్, నాయకులు పద్మ ,హసన్, మక్బూల్, గౌస్,యూసుఫ్ ,అమీర్ తదితరులు పాల్గొన్నారు.






