శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో హెచ్ఎంటి నుంచి జేపీ నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతి గురువారం నిర్వహించే వారాంత మార్కెట్ కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని మియాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వనాథ్ గార్డెన్ సమీపంలో ఫంక్షన్లు ఉన్నప్పుడు ట్రాఫిక్ పూర్తిగా అదుపు తప్పుతోందని, అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోందని అన్నారు. ఇది ప్రాణాలకు ప్రమాదం కలిగించే పరిస్థితి అని, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల వల్ల పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది కూడా ప్రమాదకరమని అన్నారు. వారాంత మార్కెట్‌ను వెంటనే ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చాలని, ట్రాఫిక్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని, ఫుట్‌పాత్ ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్, జాజేరావు, శ్రీనివాస్, దర్గా శేఖర్ ఉన్నారు.






