ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా పరిష్క‌రిస్తాం

  • కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని సాయిన‌గ‌ర్‌, మ‌దీనాగూడ‌ల‌లో వ‌ర‌ద ముంపు బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని ఆమె పంపిణీ చేశారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ.. వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య ఉన్నా త‌మ దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక తెరాస నాయ‌కులు, బ‌స్తీ, కాల‌నీవాసులు పాల్గొన్నారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here