చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు గాను హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత జాబ్ మేళా పోస్టర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ఇలాంటి మేళాల వల్ల నిరుద్యోగులకు చాలా మేలు జరుగుతుందన్నారు. HYSE ప్లేస్ మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు నడుం బిగించడం శుభ పరిణామమన్నారు.

ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు WWW.HYSEPLACEMENTS.COM వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ జాబ్ మేళాలో 100 కి పైగా కంపెనీలు, 1000 కి పైగా ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయని, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ విద్యార్హతలు కలిగిన వారు ఆ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని గాంధీ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి నవంబర్ 11వ తేదీన జాబ్ ఆఫర్ లెటర్ అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్, అజయ్, విజయ్, తెరాస నాయకులు బ్రిక్ శ్రీను, విద్యా సాగర్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.






