హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ అత్యంత పవిత్రమైన పండుగ అని హఫీజ్‌పేట డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం సాయంత్రం డివిజన్ పరిధిలోని మదీనాగూడలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొని స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. పూలను పూజించే ఈ పండుగను రాష్ట్ర మహిళలు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.






