కాల‌నీవాసుల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రిస్తాం: కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ మెయిన్ రోడ్ వద్ద సివ‌రేజ్ లైన్, స్ట్రాం వాటర్ లైన్లు బ్లాక్ అయ్యి చుట్టుపక్కల కాలనీలలో ప్రతి రోజు డ్రైనేజ్ పొంగుతున్నదని కాలనీ వాసుల‌ సమాచారం మేరకు GHMC ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలిసి హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించి తక్షణమే శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సివ‌రేజ్ లైన్, స్ట్రాం వాటర్ లైన్లు బ్లాక్ అయ్యి చుట్టుపక్కల కాలనీలలో ప్రతి రోజు డ్రైనేజ్ పొంగుతున్నదని కాలనీ వాసులు తెలిపార‌ని, దీంతో GHMC ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించ‌డం జ‌రిగింద‌న్నారు. వెంట‌నే డ్రైనేజీని శుభ్రపరచాలని అధికారుల‌ను ఆదేశించామ‌ని తెలిపారు. అలాగే జలమండలి అధికారులను బకెట్ క్లీనింగ్ చేయించాలని సూచించారు. జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సిల్ట్ క్లీనింగ్ చేయడం దగ్గరుండి పరిశీలించడం జరిగిందని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా త‌న దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, HMWSSB అడిషనల్ DGM శివ, వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here