వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తాం: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన పూరీ జగన్నాధుడి ఆలయాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, శేరిలింగంపల్లి భారాస పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ దర్శించుకున్నారు. పూరీ శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని, ముక్కోటి పర్వదినాన ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ జాతి పితగా గౌరవించే త‌మ‌ ఆరాధ్య నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి పూరీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని స్పష్టం చేశారు. ఒడిశాలోని పూరీ ఆలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ముందస్తుగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారాస అధినేత కేసీఆర్ కు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యం, సమృద్ధి, ఆనందం, శ్రేయస్సు కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను అని వెల్లడించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజల ఆశయాలను సాకారం చేయాలని ఆ శ్రీ జగన్నాథ స్వామిని వేడుకున్నాను అని చిర్రా రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కష్టాలను పారద్రోలాలని, సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లుగా స్పష్టం చేశారు. రానున్న అన్ని ఎన్నికల్లో భారాస సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించాలని ప్రార్థించారు. కేసీఆర్ నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్ లల్లో గులాబీ జెండాను ఎగరవేయనున్నట్లుగా చిర్రా రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే సరైన కార్యాచరణతో శేరిలింగంపల్లిలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here